India / General
బీఫ్ నిషేధంపై మహారాష్ట్ర మళ్ళీ కోర్టుకు...
10 days ago

బీఫ్ (గొడ్డు మాంసం) ఉంచుకోవడాన్ని నేరంగా పేర్కొంటున్న చట్టం లోని ఓ సెక్షన్ ను పునరుద్ధరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుమతిని కోరుతూ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. మహారాష్ట్ర ఎనిమల్ ప్రిజర్వేషన్ (సవరణ) చట్టం (1995) లోని సెక్షన్ 5 డీ ప్రకారం..ఒక వ్యక్తి గోవు లేదా గొడ్డు మాంసాన్ని తీసుకు వెళ్తున్నట్టు అనుమానించిన ఏ పోలీసు అధికారి అయినా అతడ్ని ఆపి ప్రశ్నించవచ్చు.

అలాగే ఇళ్ళలో సోదాలు చేయవచ్చు. కానీ తాను అమాయకుడినని, తనకేమీ తెలీదని నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి.. ఈ సెక్షన్ లోని బీ కింద నిరూపించుకోవలసిఉంటుంది. బీఫ్ నిషేధంపై దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నిరసనలతో.. బాంబే హైకోర్టు ఈ చట్టంలోని రెండు సెక్షన్లనూ 2015 లో కొట్టివేసింది. దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది.

 
 
Related News