AP and TS / Entertainment
బన్నీ హీరోయిన్లకి ప్రిన్స్ ఆఫర్
126 days ago

అల్లు అర్జున్‌తో చేసిన హీరోయిన్లకి ప్రిన్స్ మహేష్ మూవీలో‌ ఆఫర్ రావడం కంటిన్యూగా జరుగుతోంది. తమన్నాతో మొదలుపెట్టి రకుల్ ప్రీత్ వరకూ బన్నీతో చేసిన తరువాతే మహేష్ మూవీలో ఆఫర్ వచ్చింది. బన్నీతో ‘బద్రీనాథ్’ మూవీ చేసిన తరువాత మహేష్ ‘ఆగడు’ సినిమా చేసింది తమన్నా. ‘రేసుగుర్రం’ చేసిన తరువాతే శృతి హాసన్‌కు ‘శ్రీమంతుడు’లో ఆఫర్ వచ్చింది. అలాగే ‘సరైనోడు’ తరువాతే రకుల్‌కి ‘స్పైడర్’ ఆఫర్ వచ్చింది.

ఇవన్నీ చూస్తే బన్నీతో చేసిన తరువాతే మహేష్ మూవీలో ఆఫర్ రావడం అనేది సెంటిమెంట్‌గా మారిందనేది సినీ జనాల‌మాట. ఇక వంశీ పైడిపల్లితో మహేష్ చేయబోయే మూవీలో పూజా హెగ్డేని హీరోయిన్‌గా ఫైనల్ చేసారనేది లేటెస్ట్ న్యూస్. అదికూడా బన్నీతో ‘డీజే’ మూవీ చేసిన తరువాతే మహేష్ మూవీలో పూజాకి ఆఫర్ రావడంతో.. బన్నీతో చేస్తే ప్రిన్స్‌తో పక్కా అని ఫిక్స్ అయిపోయారు సినీ జనాలు.

 

Read Also

 
Related News
JournalistDiary