AP and TS / General
ఐలయ్యకు అన్నల అండ.!
10 days ago

ప్రొఫెసర్ కంచ ఐలయ్యకు మావోయిస్ట్ పార్టీ అండగా నిలబడింది. వైశ్యులను కించపరిచారని ఐలయ్యపై జరుగుతున్న దాడిని మావోయిస్టు పార్టీ ఖండిస్తోందని రాష్ట్ర కమిటీ అధికారి ప్రతినిధి జగన్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భావ ప్రకటనా స్వేచ్చను ఎవరూ అడ్డుకునే హక్కు లేదని, దేశంలో సంఘ్‌పరివార్‌ నేతృత్వంలోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడుతోందన్నారు. కులం గురించి మట్లాడటాన్ని నేరంగా చిత్రీకరిస్తూ బెదిరింపులకు పాల్పడ్టం వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.

 

ఐలయ్య రాసిన అంశాలపై కౌంటర్‌ వాదన చేయవచ్చని, కానీ బెదిరించడం అప్రజాస్వామ్యమని, కంచె ఐలయ్యకు అన్నిరకాలుగా తమ పార్టీ మద్దతునిస్తోంది, ప్రజాస్వామ్య వాదులంతా ఐలయ్యకు అండగా నిలవాలని జగన్ కోరారు.ఐలయ్య రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అనే పేరుతో ఐలయ్య రాసిన పుస్తకం వివాదాస్పదమై వైశ్యుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐలయ్య పుస్తకాలపై నిషేదం తీసుకురావడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని పార్టీ అభిప్రాయపడుతోందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, తనకు ప్రాణహాని ఉందంటూ సోమవారం ఐలయ్య తెలంగాణ డీజీపీ ని కలిసి రక్షణ కల్పించాలని కోరిన సంగతి తెలిసిందే.

 

Read Also

 
Related News
JournalistDiary