World / Crime
శాంతాక్లాజ్‌లా వచ్చి.. నరమేధం
81 days ago

టర్కీలోని ప్రధాన నగరమైన ఇస్తాంబుల్‌లో శనివారం రాత్రి పొద్దుపోయాక ఓ ఉగ్రవాది నరమేధానికి పాల్పడ్డాడు. రీనా అనే నైట్ క్లబ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో సుమారు 39 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు.

శాంతాక్లాజ్ దుస్తుల్లో వచ్చిన ఈ దుండగుడిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్లబ్‌లోకి ప్రవేశించే ముందు ఈ కిల్లర్ ఓ పోలీసు అధికారిని, మరో వ్యక్తిని కాల్చి చంపాడు. ఈ ఘటనలో గాయపడినవారిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. దాడి సమయంలో ఈ క్లబ్‌లో సల్మా హైక్ వంటి సెలబ్రిటీలతోబాటు దాదాపు 500 మంది వరకు ఉన్నారు.

ఇస్తాంబుల్‌లోని ఓర్టాకాయ్ జిల్లాలో గల నైట్ క్లబ్‌లో ఈ దారుణం జరిగింది. ఉగ్రవాది బీభత్సానికి భయపడి అనేకమంది దగ్గరలోని బాస్ ఫోరస్ నదిలోకి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ దాడిని అమెరికా ఖండించింది.



 

 
 
 
Related News

JournalistDiary