AP / crime
మెడికో సూసైడ్
320 days ago

కాకినాడలో శుభశ్రీ అనే మెడికో సూసైడ్ చేసుకుంది. అక్కడి జీ ఎస్ ఎల్ వీ మెడికల్ కాలేజీలో..రేడియోలజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఈమె కాలేజీ నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.  తీవ్రంగా గాయపడిన శుభశ్రీ ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. విశాఖపట్నానికి  చెందిన శుభశ్రీ కొన్ని నెలలుగా తన మానసిక సమస్యలకు చికిత్స పొందుతున్నట్టు తెలిసింది. పోలీసులు ఆమె మృత దేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.తనను నలుగురు విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారని శుభశ్రీ రెండు వారాల క్రితం ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసిందని, దీనిపై విచారణకు కాలేజీ యాజమాన్యం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిసింది. అయితే మానసికంగా ఇబ్బంది పడుతున్న ఈమె గతంలో కూడా రెండు సార్లు ఆత్మహత్యా యత్నం చేసినట్టు చెబుతున్నారు. 

 

Read Also

 
Related News
JournalistDiary