World / Entertainment
అరె ! మళ్ళీ అదే వరస !
146 days ago

ట్రంప్ భార్య మెలనియా వరస చూస్తే అలక పర్వం ఇంకా వీడనట్టే ఉంది. నిన్నటికి నిన్న ఇజ్రాయెల్ లో భర్త చేతిని విసిరికొట్టిన ఆమె..ఇటలీ రాజధాని రోమ్ లో ఇంకో టైపులో ఆయనకు షాకిచ్చింది. ఫస్ట్ లేడీ యాక్షన్ ట్రంప్ కి చికాకులు తెచ్చిపెట్టడం ఖాయమంటున్నారు. ఈ జంట ఇంటర్నేషనల్ ట్రిప్ అంతా వీళ్ళ అలకలు, బుజ్జగింపుల తోనే సరిపోయేట్టు ఉంది. ప్రపంచ మీడియా ముందు ఈ కపుల్ వైనం హాట్ టాపిక్ గా మారింది.

అసలు విషయానికొస్తే..రోమ్ లో విమానం ల్యాండ్ కాగానే..కిందికి దిగుతూ ట్రంప్ మెలనియా చేతిని అందుకునేందుకు ప్రయత్నించగా, ఆమె మళ్ళీ విసిరి కొట్టడమెందుకని, ఆయనకు అందకుండా తన చేతిని పైకెత్తి జుట్టు సవరించుకునే పోజుతో కనబడింది.  దీంతో ఈ వైనాన్ని కవర్ చేసేందుకు ట్రంప్ సుతారంగా ఆమె వెనుక తట్టి బుజ్జగించే ప్రయత్నం చేశాడు. ఈ కపుల్ మధ్య కోల్డ్ వార్ ఏమైనా బిగిన్ అయిందా ఏమిటనే సెటైర్లతో ట్విట్టర్లు హోరెత్తిపోతున్నాయి.


 

Read Also

 
Related News
JournalistDiary