AP and TS / Entertainment
అది తప్పు విష్ణు
256 days ago

విలక్షణ నటుడు మోహన్ బాబు తన తనయుడు విష్ణుకు వార్నింగ్ లాంటి సూచన ఇచ్చారు. విష్ణు నటించిన లక్కున్నోడు చిత్రం ఆడియో ఫంక్షన్ లో మాట్లాడిన ఆయన.. సినీ ఆడియో ఈవెంట్లకు హాజరు కానని విష్ణు ఏదో సందర్బంలో చేసిన కామెంట్స్ ని గుర్తుకు తెచ్చారు. విష్ణు.. ఓ విషయంలో నీకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను.. భార్య, పిల్లలు ఉన్నవాడివి.. ఈమధ్య టీవీల్లో చూశాను. పది మంది ఎదుట నువ్వు చేసిన తప్పు చెబుతున్నాను. 

నేను సహజంగా నా సినిమా ఆడియో ఫంక్షన్లకు కూడా వెళ్ళను అని ఓ ఇంటర్వ్యూలో చెప్పావు. అది తప్పు. నీ సినిమా ఆడియో ఫంక్షన్లకు నువ్వు వెళ్ళాలి. అలాగే ఇతర హీరోల సినిమాల ఆడియో ఫంక్షన్లకూ హాజరవ్వాలి. నిన్ను ప్రేమగా పిలిచినప్పుడు తప్పక వెళ్ళాలి. ఎక్కడకూ నేను వెళ్లనని కొంతమంది హీరోల్లా డబ్బాలు కొట్టవద్దు. అర్థమైందా..? డబ్బాలు వద్దు మనకు.. సిన్సియర్ గా ఉండు అని మోహన్ బాబు వార్నింగ్ ఇచ్చాడు.

 
 
 
Related News
JournalistDiary