India / Crime
ఔను.. దావూద్ నే మాట్లాడుతున్నా..కరాచీ నుంచి!
70 days ago

ముంబై వరుస బాంబు పేలుళ్ళ కేసు నిందితుడు, ఇంటర్నేషనల్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం బతికే ఉన్నాడు.. కరాచీలో సేఫ్ గా ఉన్నాడు. అతగాడికి ఆరోగ్యం దెబ్బ తిన్నదని, కాళ్ళు, చేతులు చచ్చుబడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు వచ్చిన కొద్దిసేపటికే అతనికేమీ కాలేదని హేల్తీగానే ఉన్నట్టు కూడా న్యూస్ చక్కర్లు కొట్టింది. తాజాగా సీ ఎన్ ఎన్ న్యూస్-18 ఎడిటర్ మనోజ్ గుప్తా..దావూద్ తో ఇంటర్వ్యూ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఇది దాదాపు సక్సెస్ అయినట్టే.. దావూద్ మాట్లాడకపోయినా అతని అసిస్టెంట్ జావేద్ చోటానీ ఫోన్ ఎత్తాడు. ఇండియా నుంచి ఓ జర్నలిస్ట్ మాట్లాడుతున్నాడని తెలియగానే, తన గుర్తింపు, తానెక్కడున్నదీ బయటపడకుండా దావూద్ వెంటనే ఫోన్ ని జావేద్ చోటానీకి ఇచ్చేశాడు.

తనను ట్రాక్ చేస్తున్నారని భయపడ్డాడు.  పాకిస్తాన్ బుకీ అయిన చోటానీ,,దావూద్ రియల్ ఎస్టేట్ వ్యవహారాలను చూస్తుంటాడు. దావూద్ ఫోన్ ని ఇతనికి ఇవ్వగానే..ఈ ఫోన్ నెంబర్ మీకెవరిచ్చారని ప్రశ్నించాడు. టైం వేస్ట్ చేయొద్దని, మీరెవరితో మాట్లాడుతున్నారో మీకు తెలుసా అని తనే ఎదురు ప్రశ్న వేశాడు. అయితే మనోజ్ గుప్తా చాలా కూల్ గా అతని నుంచి దావూద్ గురించిన వివరాలను రాబట్టడానికి ప్రయత్నించారు. చివరకు..మీరొక పని చేయండి.. మీకో నెంబరిస్తున్నా ..దానికి మీరు చెప్పదలచుకున్న విషయాలను మెసేజ్ రూపంలో ఇవ్వండి. దాన్ని ఆయనకు పాస్ చేస్తా అన్నాడు జావేద్. అంటే దావూద్ మొత్తానికి ఆరోగ్యంగానే ఉన్నట్టేనన్న విషయం కన్ఫాం అయింది.

 

Read Also

 
Related News
JournalistDiary