India / Entertainment
కత్తిలో లేనివి.. ఖైదీలో ఉన్నవి..
278 days ago

తమిళ కత్తి మూవీలో లేని సీన్లు రీ-మేక్ తెలుగు మూవీ ఖైదీ నెం.150 లో ఉన్నవి చూసి డైరెక్టర్ మురుగదాస్ షాక్ తిన్నట్టు కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ చూసి మురుగదాస్ అప్ సెట్ అయ్యాడని తెలిసింది. ఇందులో హీరో లిక్కర్ సీన్స్ చేయడం ఆయనకు నచ్చలేదని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న ఈయన..ఈ చిత్రం చూసి..మెగాస్టార్ యాక్షన్ అద్భుతంగానే ఉన్నా, ఇలాంటి సన్నివేశాల పట్ల కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. కత్తి మూవీలో హీరో కేవలం టీ వంటివే తాగుతాడు. అయితే ఖైదీలో ఏకంగా మద్యం బాటిళ్ళు చూపడం ఏమిటో అని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అలాగే కమెడియన్ ఆలీ ఆడవేషం వేయడంపై  కూడా మురుగదాస్ అబ్బే అని పెదవి విరిచినట్టు సమాచారం. ఇలాంటి చిన్న చిన్న లోపాలు మినహాయిస్తే మొత్తం మీద ఆయన ఈ సినిమా కు ఆయన మంచి మార్కులే వేశారట.

 

Read Also

 
Related News
JournalistDiary