AP and TS / Entertainment
ఆయన.. నాకు గాడ్ ఫాదర్!
710 days ago

మాటల మాంత్రికుడు, దర్శకుడు తివిక్రమ్ శ్రీనివాస్ తనకు గాడ్ ఫాదర్ లాంటివారని నటి హేమ చెప్పుకొచ్చింది. ఆయన డైరెక్టర్ కాకముందు నుంచే తనకు పరిచయమని, అంతేకాదు.. తన కోసం స్పెషల్‌గా రోల్స్ క్రియేట్ చేసేవారని తెలిపింది. ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న హేమ చాలా విషయాలను వెల్లడించింది.

తివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన అతడు, జులాయిల్లో హేమ నటించింది. ఆయన మాటలు రాసిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాలు ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి కూడా! శ్రీనివాస్‌తో కలిసి పని చేయడానికి పది సినిమాలైనా వదులుకునేందుకు తాను సిద్ధమేనని మనసులోని మాట బయటపెట్టింది. తొమ్మిదేళ్లుగా ఆయన చేస్తున్న సినిమాల్లో తాను నటిస్తున్నానని చెప్పుకొచ్చింది. 

 
 
 
Related News

Jyo achyutanand 308X300 banner