AP / Politics
మైనారిటీలకే టికెట్లు ఇస్తారా ?
123 days ago

నంద్యాల బై-పోల్ లో మెజారిటీ కులస్తులను పక్కన పెట్టి మైనారిటీ కులస్తులకే టికెట్లు ఇస్తున్నారన్న విమర్శలు బయల్దేరాయి. రెండు లక్షలకు పైగా ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో రెడ్డి కులస్తులు 15 వేల మంది, మాత్రమే! కాపులు 32 వేలు, వైశ్యులు 28 వేలు, క్రైస్తవులు 13 వేల మంది ఉన్నారని, అయితే 65 వేలమంది ముస్లిములు ఉండగా రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువగా టికెట్లు ఇవ్వడమేమిటని అంటున్నారు. మెజారిటీ కులస్తులను పక్కన పెట్టడమేమిటని
ఇది అన్యాయమేమిటనే విమర్శలు బయల్దేరాయి. ఇక్కడ బీసీలు 45 వేలమంది ఉన్నారు.

ఈ నియోజకవర్గంలో కనీసం 10 శాతం కూడా లేని సామాజికవర్గానికే టికెట్లు ఇస్తూ మిగతా కులాలవారిని విమరిస్తున్నారు. భూమా, శిల్పా, ఎస్వీ సుబ్బారెడ్డి వంటి సామాజిక వర్గ కులస్తులదేపై చేయిగా ఉంటోందని, కాంగ్రెస్, టీడీపీ వంటి ప్రధాన పార్టీలు కూడా ఈ విషయంపై నిర్లిప్తంగా ఉంటున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అయితే ఓటర్లు కూడా మైనారిటీ సామాజిక వర్గంపైనే మొగ్గు చూపడం విశేషం.

 

 

Read Also

 
Related News
JournalistDiary