India / Crime
నల్ల కట్టల బ్యాంక్...
304 days ago

పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్లాక్ మనీకి యాక్సిస్ బ్యాంక్ కేరాఫ్ అడ్రస్ అయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా  ఒక్కోరోజు ఒక్కో  యాక్సిస్ బ్యాంక్ శాఖలో పేరుకుపోతున్న  బ్లాక్‌మనీ గుట్టలు దొరకడం చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది.

ఢిల్లీలోని  యాక్సిస్‌బ్యాంక్‌కి  చెందిన మూడు బ్రాంచీలపై ఐటీశాఖ పంజా విసిరింది. తాజాగా అహ్మదాబాద్‌‌లోని  యాక్సిస్‌బ్యాంక్ శాఖపై దృష్టి సారించిన ఐటిశాఖ అక్కడ పెద్దఎత్తున బ్లాక్‌మనీ  డిపాజిట్ అయిన విషయాన్ని గమనించింది. ఈ బ్యాంక్‌కు చెందిన ఒకే బ్రాంచ్‌లో 19 నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి 89 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసిన విషయం ఐటి సోదాల్లో బయటపడింది. ఈ బాగోతానికి సంబంధించి నలుగురు యాక్సిస్‌బ్యాంక్ అధికారులను ఐటి శాఖ ప్రశ్నిస్తోంది. 

 

Read Also

 
Related News
JournalistDiary