AP and TS / Entertainment
నవదీప్ అరెస్ట్?
8 days ago

యంగ్ హీరో నవదీప్ కొన్నాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని లేటెస్ట్ న్యూస్. అంటే.. ఇదేదో సీరియస్ ఇష్యూతో కాదులెండి. బిగ్‌బాస్ షో హౌస్‌కు నవదీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని టాక్. ఈ వీకెండ్‌కు రెండు ఎలిమినేషన్స్ ఉంటాయని, ఇప్పటికే ఆ షోలో దీక్ష ఇలా ఎంటర్ అయ్యి కొంత గ్లామర్ యాడ్ చేసినా నిర్వాహకులు ఆశించిన కిక్ రాలేదని అంటున్నారు.

ఇప్పటికే బుల్లితెరపై కొన్ని షోలు చేసి, ఎన్టీఆర్ ‘బాద్‌షా’ మూవీలో నటించిన నవదీప్ ఆ హౌస్‌లో ఎంటర్ అవ్వడంతో కొంత జోష్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇదివరకే హౌస్ మేట్స్‌లో డ్రగ్ కేస్‌లో విచారణ ఎదుర్కున్న ముమైత్ ఉండగా ఇప్పుడు నవదీప్ తోడైతే కొంత మసాలా తోడవుతుందనే ఉద్దేశంతో ఛానల్ ప్లాన్ చేసిందని స్మాల్ స్క్రీన్ టాక్.

 
 
Related News