AP and TS / Entertainment
హీరోయిన్ కాదు విలన్..!
26 days ago

మెగాస్టార్ చిరంజీవి చారిత్రాత్మక చిత్రం ‘సైరా’లో నయనతార లీడ్ రోల్ చేయనుందని ఇప్పటికే అఫిషియల్‌గా క్లారిటీ వచ్చేసింది. ఐతే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ చిత్రంలో నయన్ హీరోయిన్‌గా కాకుండా ఓ నెగటివ్ రోల్ చేస్తోందని సమాచారం. ఆమె క్యారెక్టర్ చిరుని ఢీ కొట్టేలా వుంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక సైరాలో చిరుకి జోడీగా ఇద్దరు హీరోయిన్లు కూడా వుంటారనేది మరో న్యూస్.

ఇప్పటికే అఫిషియల్‌గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుందని తేలినా.. ఆమె అమితాబ్ బచ్చన్ కూతురిగా ఓ గెస్ట్ రోల్లో కనిపించబోతోందని తెలుస్తోంది. ఓవైపు నయన విలన్‌గా, మరోవైపు ప్రగ్యా కేవలం గెస్ట్ రోల్ మాత్రమే చేస్తోంటే.. మరి చిరుతో జోడీ కట్టబోయే హీరోయిన్ ఎవరంటూ సినీ లవర్స్ చర్చించుకుంటున్నారు.

 

Read Also

 
Related News
JournalistDiary