World / Health
ఈ మాసేజ్ తో ప్రాణగండం
465 days ago

బెంగుళూరులో 40 ఏళ్ళ బాబు రెడ్డికి కలిగిన దారుణమైన అనుభవమిది. మెడ నొప్పి తగ్గడానికి ఓ సెలూన్ లో మాసాజ్ కోసమని వెళ్ళాడు. వంద రూపాయలు చెల్లించి అరగంట సేపు మాసేజ్ చేయించుకున్నాడు. అంతే..ఇందుకు భారీగా మూల్యం చెల్లించు కున్నాడు. మెడ నొప్పి తగ్గకపోగా అక్కడి నరం చిట్లి పోవడంతో అతని బాధ వర్ణనాతీతం. కళ్ళు తిరగడం వంటి అనేక రుగ్మతలతో ఆసుపత్రి పాలయ్యాడు. ఎం ఆర్ స్కాన్ చేయించుకోగా బాబు రెడ్డి మెడ లోని రక్తనాళం తెగినంత పని జరిగిందని, అతని మెదడుకు రక్త సరఫరా నిలిచిపోయిందని డాక్టర్లు తేల్చారు.

ఐ సి యూ లో కొన్ని రోజులు చికిత్స పొందాడు. చివరకు హార్ట్ స్ట్రోక్ కి కూడా గురయ్యాడు. సెలూన్ సిబ్బందికి తగిన శిక్షణ లేకపోవడంవల్లే బాబురెడ్డికి ఇలాంటి దుస్థితి కలిగిందని డాక్టర్లు చెప్పారు. మొత్తానికి 10 రోజులు ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకున్నాక బాబురెడ్డి కాస్త కోలుకున్నాడు. అయితే శాశ్వతంగా మందులు వాడవలసి ఉంటుందని అంటున్నాడు. ఇక ఈ వ్యాపారి మళ్ళీ ఆ సెలూన్ వంక చూస్తే ఒట్టు.

 

Read Also

 
Related News
JournalistDiary