World / Health
తీపి రోగులకో తీపివార్త
640 days ago

ఈ దేశంలోని మధుమేహ రోగులకో తీపి వార్త.. వీళ్ళ కోసం మార్కెట్లో కొత్త మందు వచ్చేసింది. డయాబెటిక్స్‌‌‌‌‌‌‌‌తో బాధపడుతున్నవారికోసం అయ్యే ఖర్చు దీనివల్ల 80 శాతం తగ్గుతుందని అంటున్నారు. ముంబైలోని గ్లెన్‌‌మార్క్  కంపెనీ టెనెలిగ్లిప్టిన్ అనే కొత్త మందును ఉత్పత్తి చేస్తోందని, దీనివల్ల గత ఆరునెలల్లో ఈ రోగుల రోజువారీ చికిత్స ఖర్చు చాలావరకు తగ్గిందని వైద్యనిపుణులు చెబుతున్నారు. 

ఈ ట్రీట్‌‌మెంటుకు రోజుకు సగటున 45 రూపాయలు ఖర్చవుతుండగా అది 9రూపాయలకు తగ్గిపోయిందట.. గ్లెన్‌‌మార్క్‌‌తో బాటు మరో 5 కంపెనీలు కూడా టెనెలిగ్లిప్టిన్ మందును తయారు చేస్తున్నాయి. మొదట గ్లిప్టిన్ ట్రీట్‌‌మెంటుకు సంవత్సరానికి రూ.16,200 (నెలకు రూ.1350) ఖర్చవుతుందని, అయితే ఈ మెడిసిన్ ట్రీట్‌మెంటుతో అది ఏడాదికి రూ. 3,285 (నెలకు 270 రూపాయలు) తగ్గుతుందని అంచనా వేశారు. అంటే మధుమేహ రోగులకు సంబంధించి దేశవ్యాప్తంగా రూ. 1300 కోట్లు ఆదా చేయవచ్చునని భావిస్తున్నారు. జిటాప్లస్, జిటెన్ మందులను గ్లెన్‌‌మార్క్ ఇదివరకే విడుదల చేసింది.

 

 

Read Also

 
Related News
JournalistDiary