AP and TS / Entertainment
అవే నా డ్రీమ్ రోల్స్
12 days ago

ఇప్పుడు టాలీవుడ్‌లో వున్న హీరోయిన్లలో నివేదాకి మంచి పర్ఫార్మర్‌గా పేరుంది. ‘జెంటిల్‌మేన్’, ‘నిన్ను కోరి’.. రీసెంట్‌గా ‘జై లవకుశ’తో ఆమెలో మంచి నటి వుందని ప్రూవ్ అయింది. ముఖ్యంగా ‘నిన్ను కోరి’లో పల్లవిగా నివేదా పెర్ఫార్మెన్స్‌కి ఆడియన్ నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే.. తనకు ఛాలెంజింగ్ రోల్స్ చేయడం చాలా ఇష్టమని.. అటువంటి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నానని ఈ బ్యూటీ అంటోంది.

‘తను వెడ్స్ మను’లో కంగనా రనౌత్, ‘బర్ఫీ’లో ప్రియాంక చోప్రా, ‘బాజీరావ్ మస్తానీ’లో దీపికా పదుకొణే చేసిన రోల్స్ చేయాలని.. అవే తన డ్రీమ్ రోల్స్ అని అంటోంది. మరి.. ఈమె కోరినట్లుగా అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ వరిస్తాయో లేదో చూడాలి. ఇకపోతే.. ‘మహానుభావుడు’తో హిట్ కొట్టిన శర్వానంద్‌తో నివేదా జోడీ కట్టబోతోందని సమాచారం. ‘కేశవ’ డైరెక్టర్ సుధీర్ వర్మ, శర్వానంద్ కాంబోలో తెరకెక్కనున్న మూవీలో మొదట అనుపమని హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు నివేదాని కథానాయికగా ఫిక్స్ చేయాలని యూనిట్ అనుకుంటోందని టాక్.

 

Read Also

 
Related News
JournalistDiary