AP / Politics
నారావారిపల్లెలో ఏటీఎం లేదు
112 days ago

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత గ్రామం నారావారిపల్లెలో ఏటీఎం గానీ, బ్యాంకు గానీ లేవట. ఇదే కాదు.. ఈ గ్రామానికి దగ్గరలోని సుమారు డజను పల్లెల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఏ టీ ఎం కోసమో, బ్యాంకులో కొత్త నోట్లు విత్ డ్రా చేసుకోవడానికో ఈ గ్రామాల ప్రజలు దాదాపు 10 కి.మీ.ప్రయాణించి చంద్రగిరి లేదా తిరుపతి రావాల్సిందే.

 

ఇక స్వైపింగ్ మెషిన్ల సంగతి సరేసరి. నారావారిపల్లె లో ఓ రేషన్ డీలర్ మాత్రం ఒక ఎలెక్ట్రానిక్ మిషన్ వాడుతున్నట్టు తెలిసింది. ఈ గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలోని రంగంపేట లో  ఏటీఎం ఉన్నా అది పని చేయడంలేదు. దేశంలో నోట్ల రద్దు మంచిదేనని, డిజిటల్ లావాదేవీలు పెరగాలని ఇందుకోసం కృషి చేస్తున్న చంద్రబాబు తన సొంత గ్రామం లోని దుస్థితిని పట్టించుకోవడంలేదనే  విమర్శలున్నాయి.

 

 
 
 
Related News

JournalistDiary