AP and TS / Politics
మహేష్ కత్తీ.. నీ చికెన్ కూర కత్తి!
22 days ago

ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షో ఊపందుకుంటోంది. శనివారం ఈ హౌస్ పార్టిసిపెంట్స్‌తో ముచ్చటించిన ఎన్టీఆర్.. మహేష్ కత్తితో చికెన్ వడ్డించుకుని తన కోర్కె తీర్చుకున్నాడు. ఇంతవరకు కిచెన్ వైపు వెళ్ళని మహేష్ కత్తి అందులో అడుగుపెట్టాడు. అతను వండుతుండగా.. పార్టిసిపెంట్స్‌కి ఎన్టీఆర్ ఓ టాస్క్ (బాధ్యత) ఇవ్వడం విశేషం.

అదేమిటంటే.. తాము విలన్‌గా భావించే వారిని హౌస్‌మేట్స్ కత్తుల సింహాసనం (చైర్) మీద కూర్చోబెట్టి తలపై ముళ్ళ కిరీటం పెట్టడం. ఇందుకు కారణం కూడా వాళ్ళు చెప్పాలి. కెప్టెన్ కల్పనను వాళ్ళు తమ విలన్‌గా అభివర్ణించారు. మొదటి వారం ఆమె ప్రవర్తనకు, కెప్టెన్ అయ్యాక ఆమె బిహెవియర్‌కు మధ్య చాలా తేడా ఉందన్నారు వాళ్ళు. శివబాలాజీ అయితే కల్పన బిగ్‌బాస్ హౌస్‌కు పనికి రాదనేశాడు. ఇక తనను పదే పదే అన్నా అని కల్పన పిలుస్తుంటే.. ఎన్టీఆర్.. ‘అమ్మా! నన్ను అన్నా అని పిలవకు’ అని వేడుకున్నాడు.

ఈ టాస్క్ లో రెండో స్థానాన్ని సమీర్ దక్కించుకోగా, ఈ వారం మధుప్రియ ఎలిమినేట్ అయింది. అటు.. ఈ షోకి ఈ ఛానల్‌లో టీఆర్పీ రేటింగ్ పెరగడంపై ఎన్టీఆర్ చేత కేక్ కట్ చేయించి హోస్‌మేట్స్ తమ సంతోషం పంచుకున్నారు.

 
 
Related News