AP and TS / Entertainment
‘బిగ్‌బాస్’ బడ్జెట్ 45 కోట్లు!
10 days ago

ఎన్టీఆర్ చేస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షోకి సంబంధించి లేటెస్ట్ న్యూస్. ఈ కార్యక్రమాన్ని 45 కోట్ల బడ్జెట్‌తో స్టార్ మా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కేవలం మూడునెలల కాలానికి (జులై నుంచి సెప్టెంబర్) ఈ రేంజ్‌లో ఇన్వెస్ట్ చేయడం ఇదో రికార్డ్‌గా చెబుతున్నారు. ప్రతీ శనివారం, ఆదివారం రియాల్టీ షో ప్రసారం కానుంది. ఇక ఎన్టీఆర్ రెమ్యునరేషన్ విషయాని కొస్తే.. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో చిరంజీవికి ఇచ్చిన దానికంటే ఆల్‌మోస్ట్ రెట్టింపని అంటున్నారు. మరికొందరైతే ఎపిసోడ్‌ లెక్కన తీసుకుంటున్నాడని చెబుతున్నారు.

ఎన్టీఆర్ నటించనున్న బిస్‌బాస్ షో ఫస్ట్‌లుక్ వచ్చేసింది. ఛైర్‌లో హుందా కూర్చుని లైట్ స్మైల్‌తో దర్శనమిచ్చాడు. త్వరలో బుల్లితెరపై కనిపించనున్నాడు యంగ్ టైగర్. ఈ లుక్‌లో ఎన్టీఆర్‌ని చూసిన అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. బాగా పాపులరవుతున్న బిగ్‌బాస్ షో  కోసం నిర్వాహకులు దీనికోసం ఎన్టీఆర్‌ని సంప్రదించడం, హోస్ట్‌గా వ్యవహరించేందుకు ఆయన ఓకే చేయడం జరిగిపోయింది. భారీ పారితోషికం హీరోకి ఆఫర్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ‘జై లవకుశ’తో బిజీగావున్న ఎన్టీఆర్, మరో రెండు ప్రాజెక్టులు రెడీ చేస్తున్నాడు. అదే సమయంలో బిగ్‌బాస్‌కి కాల్షీట్స్ ఇవ్వడం గమనార్హం. 

 

 
 
 
Related News

JournalistDiary