AP and TS / Politics
తారక్ పార్టీ పెట్టాడా?
89 days ago

తన తాజా చిత్రం ‘జై లవకుశ’ కోసం తారక్ ప్రత్యేకంగా పార్టీ పెట్టాడా? పొలిటికల్ లీడర్‌గా ఇందులో కనిపించనున్నాడా? చూడబోతే అలాగే ఉంది. లేటెస్ట్‌గా బయటికొచ్చిన ఈ చిత్రం వర్కింగ్ స్టిల్ ఒకటి ఈ విషయాన్ని చెప్పకనే చెప్పింది. సమ సమాజ్ పార్టీ పేరిట ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్టున్న ఎన్టీఆర్ ఫోటోతో కూడిన జెండాలు, బ్యానర్లు కట్టిన జీపు స్టిల్ బయటపడింది.

ఈ స్టిల్ చూస్తే, ఉత్తర భారతంలో ఏదో ప్రాంతానికి చెందిన స్టోరీలోని పాత్రగా కనిపిస్తోంది. ఈ స్టిల్ లీకయిందా, లేక యూనిట్ కావాలనే రిలీజ్ చేసిందా అన్న విషయం తేలాల్సి ఉంది. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్న ‘జై లవకుశ’ చిత్రం సెప్టెంబర్ 21న విడుదల కానుంది.

 

Read Also

 
Related News
JournalistDiary