India / Entertainment
24 గంటల్లో 2 కోట్ల పైగా.. ట్రైలర్ క్లిక్స్
7 days ago

భారీ సినిమాలు నిర్మించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. తీసాక సరైన ప్రమోషన్ ఉంటేనే ఓపెనింగ్స్ అదరగొడతాయ్. బాహుబలి కంక్లూజన్ ప్రచారం ఏ రేంజ్ లో జరిగిందో కలెక్షన్స్ ఆ స్థాయిలోనే వచ్చాయి. ఇదే రూట్ లో ఇపుడు బాలీవుడ్ లో భారీ చిత్రం " పద్మావతి " ఫాలో అవుతోందని బాలీవెడ్ టాక్.

టాప్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున ఈ మూవీ ప్రొడక్షన్ స్టార్టింగ్ నుండే భారీ అంచనాలున్నాయి. లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ కు ఒక్కరోజులో 2 కోట్ల 14 లక్షల పైగా క్లిక్స్ వచ్చాయంటే ఇది సెన్సేషనల్ రికార్డే. డిసెంబర్ 1 న ధియేటర్స్ కు వస్తున్న పద్మావతి లో దీపికా రణవీర్ సింగ్ షాహిద్ కపూర్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న పద్మావతి రిలీజయ్యే లోగా ప్రమోషన్లో ఇంకెన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో.

 

Read Also

 
Related News
JournalistDiary