AP / Entertainment
మరి ఎందుకలా చేశారు?
214 days ago

వరుస ట్వీట్లతో కేంద్రంలోని మోదీ సర్కారుకు ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తోన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వరుసగా ఇవాళ కూడా ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించారు. భాజపా నేత సిద్దార్థనాథ్‌సింగ్‌కు నాది ఒకటే సూటి ప్రశ్న అంటూ... సుదీర్ఘ అనుభవం, నిపుణులైన మీ నేతలు చరిత్రాత్మక తప్పిదం ఎలా చేశారని ప్రశ్నించారు.

మీ చరిత్రాత్మక తప్పిద నిర్ణయం అమాయకుల ప్రాణాలు బలి తీసుకుందని వ్యాఖ్యానించారు. కాగా, పవన్ వ్యాఖ్యలపై సిద్దార్థనాథ్ అనేక సందర్భాల్లో స్పందించారు. పవన్ అవగాహన లేకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తాజాగా సింగ్ పవన్ విమర్శించారు. కాగా, గోవధ, రోహిత్ వేముల ఆత్మహత్య, దేశభక్తి, నోట్ల రద్దు, ప్రత్యేక హోదా..ఇలా ఐదు అంశాలపై రోజుకొక దాని పైన పవన్ స్పందించి సంగతి తెలిసిందే.

 

 
 
 
 
Related News
 
 
 
JournalistDiary