AP and TS / Entertainment
పవన్ లాస్ట్ మూవీ ఇదేనా..?
26 days ago

‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ తరువాత పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోన్న న్యూ మూవీ మీద భారీ అంచనాలే వున్నాయి. ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ ఫ్లాప్ కావడంతో.. అభిమానులు ఈ సినిమా మీదే ఆశలన్నీ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే త్రివిక్రమ్ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌గా మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని సూపర్ హిట్ చేసి హ్యాట్రిక్ కొట్టాలనే కసితో వున్నాడు త్రివిక్రమ్.

పవన్‌తో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ జతకడుతున్న ఈ మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్‌గా జరుగుతోంది. అయితే పవన్ చేస్తున్న లాస్ట్ మూవీ ఇదేనని.. త్రివిక్రమ్ మూవీ తరువాత పవన్ ఇక సినిమాలు చేయడనే టాక్‌ ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సినిమాలని పక్కన పెట్టి ఫుల్‌టైం ‘జనసేన’ కోసం పనిచేసేలా పవన్ ప్లాన్ చేస్తున్నాడట.

 

 
 
 
Related News

JournalistDiary