AP and TS / Politics
బాబుగారికి థ్యాంక్స్
13 days ago

ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల పట్ల, సానుకూల స్పందన పట్ల జనసేన అధ్యక్షుడు, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశాడు. బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టడం తన తొలి విజయమని ట్వీట్ చేశాడు. ఉద్దానం సమస్యపై అని రాజకీయపార్టీలు స్పందింఛాయంటే అది వాటి సామాజిక బాధ్యత అన్నాడు.

బాధితుల విషయంలో తనతో కలిసివచ్చిన మీడియాకు పవన్ కృతజ్ఞతలు తెలిపాడు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు..ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు  అన్ని విధాలుగా సాయ పడతామని, నెలకు వారికి 1500 రూపాయల పెన్షన్ ఇస్తామని, కిడ్నీ వ్యాధి నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకుంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

 
 
 
Related News

JournalistDiary