AP and TS / Entertainment
పవన్ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్
9 days ago

ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ న్యూ ఫిల్మ్ ఫస్ట్ లుక్ దీపావళి స్పెషల్ గా వస్తోందని టాక్. త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ చేస్తున్న 3 వ మూవీ ఇది. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ కోసం ఫాన్స్ ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఈ మూవీ గురించి ఇప్పటివరకూ ఎలాంటి సెట్ కబుర్లు లేకుండా మేనేజ్ చేసిన యూనిట్ ఫైనల్ గా టైటిల్ " అజ్ఞాతవాసి " కే ఫిక్స్ అయ్యారని సమాచారం. కీర్తి సురేష్ అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా ఖుష్బూ రావు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్న ఈ మూవీకి కొలవెరి ఫేమ్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అత్తారింటికి దారేదిలో లాగానే పవన్ ఈ మూవీలో రిచ్ బిజినెస్ మాన్ అయినా బాషా స్టైల్ లో మరో చోట లైఫ్ లీడ్ చేస్తుంటాడని యాక్షన్ పార్ట్ కు ఇంపార్టెన్స్ ఉంటుందని టాక్. రావు రమేష్ రోల్ కు వింతైన ఫ్యామిలీ స్టైల్ ఉంటుందని కూడా వినిపిస్తోంది.

 

Read Also

 
Related News
JournalistDiary