AP / crime
తీసేది షార్ట్ ఫిల్మ్...చేసేది...
54 days ago

సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ యువతుల్ని మోసగించిన వైడా నిఖిల్ అనే పాతికేళ్ళ స్టూడెంట్ ను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలోని మద్దిలపాలెం కు చెందిన ఇతగాడు ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో బీ టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.

పనిలో పనిగా తరచూ షార్ట్ ఫిల్ములు కూడా తీస్తుంటాడు. ఆరు నెలలక్రితం ఫేస్ బుక్ ద్వారా కొందరు యువతులతో పరిచయం పెంచుకుని సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానంటూ నమ్మించాడు.కెమెరా టెస్టింగ్, స్టిల్ ఫోటోలు అంటూ వారిని పిలిచేవాడని, గదిలో వాళ్ళు దుస్తులు మార్చుకొంటుండగా సీక్రెట్ గా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసేవాడని తెలిసింది. నిఖిల్ పై ఓ యువతి కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. ఈ బ్లాక్ మెయిలర్ పెళ్లి కూడా చేసుకున్నాడని మరో యువతి కూడా కంప్లైంట్ చేసింది.

 

 
 
 
Related News

JournalistDiary