Telangana / Crime
వ్యాన్‌ నిండా నోట్ల కట్టలే కట్టలు
290 days ago

పెద్దఎత్తున నోట్ల కట్టలతో హైదరాబాద్ సిటీలోకి ప్రవేశిస్తున్న డీసీఎం వ్యాన్‌ని శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో అటుగా వచ్చిన డీసీఎంని ఆపి డ్రైవర్‌ను ప్రశ్నించగా, అతడు పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో అనుమానంతో వాహనాన్ని సోదా చేయగా, భారీ ఎత్తున కరెన్సీ బయటపడింది. దీంతో డీసీఎంని సీజ్ చేసిన పోలీసులు, డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు.

దీన్ని ఫాలో అవుతూ వస్తున్న ఓ జీప్‌ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్మల్‌గా ప్రభుత్వానికి సంబంధించిన మనీని తీసుకెళ్తే సెక్యూరిటీ వుంటుంది. అక్కడ అలాంటి సీన్ కనిపించలేదు. ఇంతకీ ఈ వాహనం ఎక్కడి నుంచి వస్తోంది? అందులో దొరికిన డబ్బెంత? ఇంతకీ ఉన్నవి కొత్తనోట్లా?లేక రద్దయిన పాత నోట్లా? ఎవరికి సంబంధించినవి అనేది తేలాల్సివుంది. ఇప్పటికే ఆదాయపు పన్ను అధికారుల సోదాల్లో దేశవ్యాప్తంగా బ్లాక్‌మనీ బయటపడుతున్న విషయం తెలిసిందే! 

 

Read Also

 
 
Related News
JournalistDiary