India / Politics
సినిమాలో ఛాన్స్ ఇస్తానంటూ..
225 days ago

ముంబైలో ఓ వర్ధమాన నటిపై ఎన్నారై ప్రొడ్యూసర్ ఒకడు అత్యాచార యత్నం చేశాడు. రాజేంద్ర బజాజ్ అనే ఈ నిర్మాత తను తీసే చిత్రంలో ఛాన్స్ ఇస్తానని అంధేరీ లో ఉంటున్న ఆమె ఇంటికి వెళ్లి అసభ్యంగా ప్రవర్తించాదు. 

గతనెల 29 న తన ఇంటికి వచ్చిన బజాజ్..తనను పెళ్లి చేసుకుంటానని, సినిమాలో మంచి రోల్ ఇస్తానని అంటూ అత్యాచార యత్నం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బజాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. చివరకు 20 వేల పూచీకత్తుపై బెయిలు లభించి  బజాజ్ విడుదలయ్యాడు.


 
 
Related News