AP and TS / Entertainment
నిర్మాతలకే మినహాయింపు....
45 days ago

చరిత్రాత్మక సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ వినోదపు పన్ను మినహాయింపు ఇస్తున్నాయి. తాజాగా బాలయ్య సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి కి అటు ఏపీ సీ ఎం చంద్రబాబు, ఇటు తెలంగాణా సీఎం కేసీఆర్ ఇద్దరూ ఈ సౌకర్యం కల్పిస్తూ జీవోలు జారీ చేశారు. 2015 అక్టోబరులో గుణశేఖర్ సినిమా రుద్రమదేవికి కూడా ప్రభుత్వాలు వినోదపు పన్ను మినహాయించాయి. ఇలా హిస్టారికల్ మూవీలకు ఈ సౌకర్యం కల్పించడంతో నిర్మాతలు బాగానే ప్రయోజనం పొందినా..ఫ్యాన్స్ గానీ సామాన్య ప్రజలు గానీ ఈ వెసులుబాటుకు నోచుకోవడంలేదు. ప్రేక్షకులు తప్పనిసరిగా థియేటర్ యాజమాన్యాలు నిర్ణయించిన రేట్లకు టికెట్లు కొనుక్కుని వెళ్ళాల్సిందే.

అవి ఎంత అధికమైనా వినోదపు పన్ను మినహాయింపు ఫెసిలిటీ వీరికి మాత్రం దక్కడంలేదు. ఇందుకు అనువుగా జీవోలు ఏమైనా ఉన్నాయా మరి! ఈ మినహాయింపు లోని ముఖ్య ఉద్దేశం తక్కువ రేట్లకు టికెట్లను కొనడానికి ఆడియెన్స్ కు కూడా సౌకర్యం కల్పించడమే. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలకు పన్ను మినహాయింపు 13 శతం ఉంటుంది. వసూళ్లు 100 కోట్లు దాటితే ఈ 13 శాతం సొమ్ము ను తిరిగి నిర్మాతకే చెల్లించాల్సి ఉంటుందని ఓ అధికారి అంటున్నారు. కాగా వినోదపు పన్ను మినహాయింపు కోరడంలో తప్పు లేదని, తాను 80 కోట్ల బడ్జెట్ తో సినిమా తీశానని గుణశేఖర్ చెబుతున్నారు. మరి ప్రేక్షకుల మాటో అని అడిగితే ఆయన నుంచి సమాధానం లేదు.

 

 
 
 
Related News

JournalistDiary