India / Crime
వాడికిదేం పొయ్యేకాలం..?
222 days ago

పూణేలో 44 ఏళ్ళ ఓ వ్యక్తి చేసిన బండారం బట్టబయలైంది. తన ఫ్రెండ్ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజేష్ మెహతా అనే ఈ వ్యక్తి సల్వార్ కమీజ్ దుస్తులు ధరించి మహిళలా అతని ఇంట్లో ప్రవేశించి ఆమెతో శృంగారం ఒలకబోస్తూ వచ్చాడట. ఇలా ఏడేళ్ళుగా ఈ యవ్వారం సాగినా చివరకు పట్టుబడ్డాడు. 

తన స్నేహితుడు ఇంట్లో నిద్ర పోతుండగా మత్తు మందిచ్చాడని, అయితే ఆ ఫ్రెండ్ కు అసలు సంగతి తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిసింది. రాజేష్ తానెవరో ఎవరూ గుర్తు పట్టకుండా ఇలా ఆడదానిలా తన మిత్రుని ఇంట్లో ప్రవేశించేవాడట. పోలీసులు అతగాడిని అరెస్టు చేసి కేసులు పెట్టారు.ఈ వింత మనిషి వ్యవహారం స్థానికంగా సంచలనం సృష్టించింది.

 
 
Related News