బేటీ బచావ్ ...మోదీకి రాహుల్ సవాల్

దేశంలో చిన్నారులపై పెరిగిపోతున్న అత్యాచారాలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. కథువా, సూరత్, ఉన్నావ్ వంటి రేప్ ఘటనలు ఈ దేశాన్ని కుదిపివేశాయని, పిల్లలపై లైంగిక దాడులు, రేప్ లని నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. మోదీ ప్రభుత్వం లేవనెత్తిన ‘ బేటీ బచావ్..బేటీ పఢావ్ ‘ నినాదం గురించి ప్రస్తావించిన ఆయన.. మొదట బేటీ బచావ్ (ఆడపిల్లలను రక్షించండి) పై దృష్టి పెట్టాలని సవాల్ చేశారు.

కథువా వంటి ఘటనలు అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్టను మంట గలిపాయని రాహుల్ దుయ్యబట్టారు. రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారంపై తనతో 15 నిముషాలు చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. పార్లమెంటులో మౌనంగా కూచోవడం కాదు..దీనిపై కనీసం పావుగంట సేపు నాతో మాట్లాడి నా సందేహాలను తీర్చండి అని ఆయన అన్నారు.