AP and TS / Politics
సీఎం లుగా రాంమాధవ్, మురళీధర్ ?
4 days ago

రెండు తెలుగు రాష్ట్రాలపైనా ఆరెస్సెస్ కన్నేసింది. ఈ రాష్ట్రాల్లో తమ విధేయులు రాం మాధవ్, మురళీధర్ లను సీఎం లుగా చేయాలని ఆరెస్సెస్ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా పక్కా వ్యూహం అనుసరించాలని, ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టి.. . ఏపీలో రాం మాధవ్, తెలంగాణాలో మురళీధర్ లను ముఖ్యమంత్రులుగా చేస్తే ఎలా ఉంటుందని ఈ వర్గాలు స్కెచ్ వేస్తున్నట్టు చెబుతున్నారు.

అయితే సీనియర్ నేతలు మాత్రం తమను సంప్రదించకుండానే ఇలాంటి నిర్ణయాల దిశగా ఎలా ఆలోచిస్తారని లోలోపలే తమ అసంతృప్తిని వెలిగగ్గుతున్నట్టు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనలపై ఇంకా విస్తృత స్థాయిలో చర్చలు జరగలేదు. కాగా.. తెలంగాణాలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని స్థానిక బీజేపీ నేతలతో సహా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సైతం ప్రకటించారు.

 

 
 
 
Related News

JournalistDiary