AP / general news
లక్ష్మీపార్వతి పక్కన నువ్వే హీరో
9 days ago

ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి- వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో ఎన్టీఆర్ జీవిత చరిత్రలో ఓ కోణాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించిన రామ్ గోపాల్ వర్మపై సోమిరెడ్డి సెటైర్లు వేశారు. పనీపాటలేని వ్యక్తి రాంగోపాల్‌వర్మ.. అతనెప్పుడూ వివాదాల్లో ఉంటాడని విమర్శలు చేశారు. అంతేకాదు, తీసే సినిమాలు హిట్టయ్యేలా చూసుకో అని హితవు పలికారు.

'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' అనే సినిమా తీయడం సంతోషకరమన్న ఆయన.. త్యాగశీలి లక్ష్మీపార్వతి.. సినిమాలో హీరోయిన్‌గా ఆమెనే పెట్టుకోమనండి అంటూ ఎద్దేవా చేశారు సోమిరెడ్డి. ఇక సోమిరెడ్డి వ్యాఖ్యలపై రాంగోపాల్‌వర్మ తనదైన శైలిలో స్పందించారు. మీ ఉచిత సలహాకు ధన్యవాదాలు.. మీరు ఓకే అంటే లక్ష్మీపార్వతి పక్కన మిమ్మల్నే హీరోగా పెట్టుకుంటా అని ఎకసెక్కాలాడారు వర్మ. వీరి మాటల యుద్ధం ఇంతటితో ఆగుతుందో ఇంకా దూరం వెళ్తుందో చూడాలి.

 

Read Also

 
Related News
JournalistDiary