AP and TS / Politics
లోగుట్టు బయట అదే..
52 days ago

‘ఊహలు గుసగుసలాడే’ ఫిల్మ్‌తో ఎంట్రీ ఇచ్చి పాస్ మార్కులు కొట్టేసింది రాశి ఖన్నా. అంతకుముందే జాన్ అబ్రహం ‘మద్రాస్ కేఫ్’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన రాశి, ఆ తర్వాత తన ఫోకస్ మొత్తం టాలీవుడ్ మీద పెట్టింది. ఆమె చేసిన సినిమాలు పెద్దగా హిట్ కాకున్నా ఆఫర్లు మాత్రం బాగానే వస్తున్నాయి. సింప్లిసిటీ, యాటిట్యూడ్ కారణంగానే ఆఫర్లు వస్తున్నాయనేది ఫిల్మ్‌నగర్ టాక్.

సినిమా రిలీజ్ అయిన వచ్చే నెగిటివ్ కామెంట్స్‌ని పట్టించుకోనని, అలాగని పాజిటివ్‌ని తలకెక్కించుకోనని రాశి అంటోంది. వర్క్‌ని పూర్తి డెడికేషన్‌తో చేస్తానని చెబుతోన్న రాశి, నటన అంతగా రాదంటోంది. తన లోపాలేంటో తనకు తెలుసని.. నటిగా ఇంకా తనకింకా ఫుల్‌మార్క్‌లు పడలేదని కూడా చెబుతోంది. ప్రస్తుతం గోపీచంద్ ‘ఆక్సిజన్’ చేస్తున్న రాశి చేతిలో రెండు తమిళ చిత్రాలూ వున్నాయి.


 

 
 
 
Related News

JournalistDiary