AP and TS / Entertainment
రూట్ మార్చిన మాస్ మహారాజా
128 days ago

రవితేజ కన్ను ఇప్పుడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ల మీద పడింది. వరుసగా యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ మీద వున్న ‘టచ్ చేసి చూడు’తో వివి వినాయక్ శిష్యుడు విక్రం సిరికి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చాడు. ‘పటాస్’, ‘సుప్రీమ్’ లాంటి హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడితో ‘రాజా ది గ్రేట్’ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా సెట్స్ మీద వుండగానే మరో యంగ్ డైరెక్టర్‌ని లైన్లో పెట్టాడు రవితేజ.

రీసెంట్‌గా ‘కేశవ’తో హిట్ ఇచ్చిన సుధీర్ వర్మతో మూవీ చేయడానికి రవితేజ ఓకే చెప్పేసాడట. రవితేజతో సినిమా చేయబోతున్నానని సుధీర్ వర్మ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ‘స్వామిరారా’ లాంటి థ్రిల్లర్ మూవీతో హిట్ ఇచ్చిన సుధీర్ వర్మ.. ‘దోచెయ్’తో తడబడినా ‘కేశవ’తో ఫాంలోకి వచ్చాడు. రవితేజలాంటి మాస్ ఇమేజ్ వున్న హీరోని సుధీర్ వర్మ ఎలా ప్రజెంట్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

 

Read Also

 
Related News
JournalistDiary