AP and TS / Entertainment
జయ జానకి నాయక మూవీ రివ్యూ
10 days ago

బెల్లంకొండ శ్రీనివాస్ మూడో చిత్రం " జయ జానకి నాయక " శుక్రవారం గ్రాండ్ గా రిలీజైంది. దర్శకుడు బోయపాటి శ్రీను మార్క్ సినిమా ఆయిన ఈ చిత్రం పూర్తి మాస్ అనిపించుకుంది. బోయపాటి  అక్కడక్కడా ఎమోషనల్ టచ్ ఇచ్చుకుంటూ వెళ్ళినా,, శ్రీనివాస్ యాక్టింగ్ లోని బలాలను, బలహీనతలను కూడా చూపగలిగాడు. కామెడీ పెద్దగా లేని జయ జానకి నాయక చిత్రం కథ బ్రీఫ్ గా..

 

తన కుటుంబంలో తండ్రి చక్రవర్తి (శరత్ కుమార్), అన్నయ్య (నందు) అంటే గగన్ ( బెల్లంకొండ శ్రీనివాస్) కు ప్రాణం. తన ఫ్యామిలీయే లోకంగా  గడిపేస్తుంటాడు. ఓ సందర్భంలో స్వీటీ (రకుల్ ప్రీత్ సింగ్) పరిచయమవుతుంది. షరా మామూలే ! ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే స్వీటీ జీవితంలో ఓ అనూహ్య ఘటన జరుగుతుంది.

అంతవరకూ రెక్కలొచ్చిన పక్షిలా ఎగిరిన ఆమె ఒక్కసారిగా పంజరంలోని చిలకలా మారిపోతుంది. తనకు ఎదురైన పరిస్థితులనుంచి బయటపడలేకపోతుంది. ఆమెను ఆ గడ్డు పరిస్థితుల నుంచి రక్షించడానికి గగన్ ఏం చేశాడు ? అశ్వింత్ నారాయణ (జగపతిబాబు) కి, స్వీటీకి మధ్య జరిగిందేమిటి..? ప్రగ్యా జైస్వాల్ ఎవరు ? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

 

గతంలో వచ్చిన ప్రేమకథల చిత్రంలాంటిదే జయ జానకి నాయక కూడా ! తను ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు ఏం చేశాడు, ఎవరిపై పోరాడాడన్నదే దీని థీమ్. ఈ స్టోరీ చుట్టూనే సన్నివేశాలను అల్లుకున్నాడు బోయపాటి. శ్రీనివాస్ ఫైట్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. రకుల్ తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా, తన నటనతో జగపతిబాబు ఆకట్టుకున్నాడు. పాటల్లో ఒకటి రెండు బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ డ్రం బీట్స్ అదిరాయి. మాస్ ని ఆకట్టుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ మూవీ. 

 
 
Related News