AP and TS / Entertainment
రోజాకు ఛాన్స్ ..ఫస్ట్ అనౌన్స్‌మెంట్
10 days ago

లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో  ఎమ్మెల్యే రోజాకు ఛాన్స్ ఉంటుందని ఈ మూవీ దర్శకుడు రాం గోపాల్ వర్మ తెలిపాడు. మంగళవారం చిత్తూరు జిల్లా పలమనేరులో చిత్ర నిర్మాత, వైసీపీ నేత రాకేష్ రెడ్డి ఇంట్లో ఆయనతో కలిసి మాట్లాడిన ఆయన.. ఈ సినిమాకు సంబంధించి ప్రధాన పాత్రల కోసం ఇంకా నటీనటుల ఎంపిక జరగలేదన్నారు.

ఎన్టీఆర్ లైఫ్ లోని ప్రధాన ఘట్టాలను ఈ మూవీలో తెరకెక్కిస్తామని చెప్పారు. కాగా.. రాజకీయాలతో తమ చిత్రానికి సంబంధం ఉండదని, ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టి మూవీ తీస్తామని నిర్మాత రాకేశ్ రెడ్డి తెలిపారు.

 

Read Also

 
Related News
JournalistDiary