World / Crime
నల్ల సముద్రంలో కూలిపోయింది
120 days ago

రష్యాలో రక్షణ శాఖకు చెందిన ఓ విమానం నల్ల సముద్రంలో కూలిపోయింది. విమాన శకలాలను సముద్రంలో గుర్తించారు. టీయూ- 154 అని వ్యవహరిస్తున్న ఈ ప్లేన్‌లో 83 మంది ప్రయాణికులతో బాటు 8 మంది సిబ్బంది ఉన్నారు.

స్థానిక కాలమానం ప్రకారం.. ఇది ఆదివారం తెల్లవారుజామున సుమారు ఐదున్నర గంటలకు సోచి నుంచి సిరియా సముద్ర తీర నగరం లటాక్యాకు బయలుదేరింది. అయితే కొద్ది సేపటికే రాడార్‌తో సంబంధాలను కోల్పోయింది. ఈ విమానంలో జర్నలిస్టులు, సైనికాధికారులు, మ్యూజిషియన్స్ ఉనట్టు తెలుస్తోంది.

సిరియాలోని రష్యన్ బేస్‌లో జరిగే మ్యూజిక్ కన్సర్ట్‌కు హాజరయ్యేందుకు ప్రముఖ అలెగ్జాండ్రోన్ మిలిటరీ బ్యాండ్ సభ్యులు ఈ విమానంలో ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. సహాయ, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

 

 
 
 
Related News

JournalistDiary