AP and TS / Entertainment
బాహుబలి బాటలో ‘సాహో’!
19 days ago

‘బాహుబలి’ సిరీస్ ప్రభాస్ కెరీర్‌కు మైల్‌స్టోన్‌గా నిలవడంతోపాటు తెలుగుసినిమా స్టామినాను వరల్డ్‌వైడ్‌గా చాటింది. ఐదేళ్లపాటు ‘బాహుబలి’కి అంకితమైన ప్రభాస్ ఇప్పుడు ‘సాహో’ సెట్స్‌లో బిజీ అయ్యాడు. డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైన‌ర్‌గా 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సాహో’ తెరకెక్కుతోంది. 2018 సమ్మర్ రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘సాహో’ షూటింగ్ డీటైల్స్ ఏవీ ఇప్పటికి అనౌన్స్ కాలేదు.

బాహుబలిలానే సాహో ఫస్ట్ మేకింగ్ టీజర్‌ను ప్రభాస్ బర్త్ డే స్పెషల్‌గా ఈనెల 23న రిలీజ్ చేయబోతున్నారని ఇన్‌సైడ్ న్యూస్. బాహుబలి రెండు భాగాలకూ ఇలా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గానే మేకింగ్ - లుక్ రిలీజ్ చేసిన సెంటిమెంట్‌ను సాహోకి కూడా ఫాలో అవుతున్నారని టాక్. మరి సాహో ప్రభాస్‌ను బాహుబలి మానియా నుండి ఎలా టర్న్ చేయనుందో చూద్దాం!

 

Read Also

 
Related News
JournalistDiary