India / Sports
నా సినిమా తీస్తారా..?
182 days ago

ఒలంపిక్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ తన జీవితంపై ఎవరైనా సినిమా తీస్తే తనకు అభ్యంతరం లేదని ప్రకటించింది. ఇలాంటిచిత్రాలు రెజ్లింగ్ వంటి స్పోర్ట్స్ మరింత పాపులర్ కావడానికి దోహదపడతాయని తెలిపింది. హర్యానా రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగత్, ఆయన కుమార్తెల లైఫ్ పై తీసిన దంగల్ మూవీని ఆమె ప్రస్తావించింది.

ఇలాంటివి మరిన్ని రావాలనికోరుకుంటున్నానని, నా లైఫ్ మీద ఎవరైనా సినిమా తీస్తే సంతోషిస్తానని ఆమె చెప్పింది. అయితే తన రోల్ లో ఎవరిని ఎంపిక చేయాలన్నది నిర్మాతలు, దర్శకుల ఇష్టమని, అది తన పని కాదని సాక్షి పేర్కొంది. దంగల్ మూవీని ప్రశంసించిన ఆమె.. ప్రో-రెజ్లింగ్ రెండో దశ ఫైట్ కు నేను రెడీగా ఉన్నానని పేర్కొంది. ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం రికార్డుల పరంగా దూసుకుపోతోంది.


 

 
 
 
Related News

JournalistDiary