AP and TS / Entertainment
అక్కినేనితో బాధ్యత మరింత పెరిగింది
7 days ago

అక్కినేని సమంత అనేపేరు తన బాధ్యతను మరింత పెంచిందని చెప్పింది నవవధువు సమంత అక్కినేని. సమంత రూత్ ప్రభు పేరిట సోషల్ మీడియా అకౌంట్లు నెరపిన సమంత వివాహం అనంతరం సమంత అక్కినేనిగా పేరుమార్చుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎలా ఫీలవుతున్నారని రాజుగారి గది2 ప్రమోషన్ లో పాల్గొన్న సమంతను మీడియా ప్రశ్నించగా ఆమె పై విధంగా సమాధానమిచ్చింది.

అక్కినేని అభిమానుల అంచనాలకు అనుగుణంగా నడుచుకుంటానని..తన భర్త, కుటుంబం ఎలాంటి ఆంక్షలు విధించకుండా సినిమాలు చేసేందుకు తనకు పూర్తి స్వేచ్చనిస్తున్నారని చెప్పుకొచ్చింది సమంత. ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రాజుగారి గది 2 సినిమాలో సమంత, నాగార్జున నటించగా, ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Read Also

 
Related News
JournalistDiary