AP and TS / Entertainment
ఇకపై బిజినెస్ వుమెన్‌గా సమంత
74 days ago

నటీనటులు ఓ వైపు గ్లామర్ ఇండస్ర్టీలో మెరుస్తూనే మరోవైపు వ్యాపారాలు చేయడం కొత్తేమీకాదు. ఇప్పటికే తమన్నా, కాజల్ వంటివాళ్లు అందులోకి రాగా, ఈ జాబితాలోకి సమంత కూడా చేరిపోయింది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న సమంత తాజాగా ఓ కొత్త వ్యాపారం మొదలుపెట్టింది. ఎస్‌వీఎస్ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పీ పేరిట తాను సొంత బిజినెస్ పెడుతున్నానంటూ స్వయంగా ప్రకటించింది. సమంత చేసిన ఈ ప్రకటనకి అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇంతకీ సామ్ కొత్తగా ప్రారంభించిన బిజినెస్ ఏంటి? ఏమైనా ఉత్పత్తులా? లేక సేవలకు సంబంధించినదా? దీనిపై ఓ క్లారిటీ వస్తే ఓ పనైపోతుందంటున్నారు ఆమె ఫ్యాన్స్. సో.. ఈ లెక్కన సమంతను ఇకపై బిజినెస్ ఉమన్‌గా బిజీ కానుందన్నమాట!

 

Read Also

 
Related News
JournalistDiary