India / Entertainment
‘టాయిలెట్‌’లో కత్తి బ్యూటీ
29 days ago

తెలుగులో ‘కత్తి’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సనా ఖాన్.. ఆ తరువాత ‘గగనం’, ‘మిస్టర్ నూకయ్య’ లాంటి సినిమాలు చేసినా సక్సెస్ కాలేకపోయింది. తరువాత సిల్క్ స్మిత బయోపిక్ ‘డర్టీ పిక్చర్’ తమిళ్ రీమేక్‌లో బోల్డ్‌గా నటించినా.. అక్కడా వర్కవుట్ కాలేదు. దాంతో బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ ‘వజా తుమ్ హో’ మూవీలో ఓ రేంజ్‌లో గ్లామర్ షో చేసింది. అయినా.. అక్కడ కూడా ఆఫర్లు అంతంత మాత్రంగానే వున్నాయి.

అక్షయ్ కుమార్ హీరోగా వస్తోన్న ‘టాయిలెట్ - ఏక్ ప్రేమ్ కహానీ’లో సనా ఖాన్ నటిస్తోంది. భూమి ఫడ్నేకర్ హీరోయిన్‌గా చేస్తుంటే.. సనా సపోర్టింగ్ రోల్‌తో సరిపెట్టుకుంది. అయితే ‘టాయిలెట్’లో తన రోల్‌కి ఇంపార్టెన్స్ వుంది కాబట్టే చేస్తున్నానని సనా అంటోంది. అక్షయ్ కుమార్‌కి, తనకి మధ్య వున్న సీన్లు సూపర్‌గా వచ్చాయని, హీరోతో పోటీ పడి నటించడానికి చాలా హోం వర్క్ చేశానని తెలిపింది.

 
 
Related News