Telangana / Crime
ఆ గుడుంబా వ్యాపారి కేరళలో అరెస్ట్
41 days ago

హైదరాబాద్ నానక్‌రాం గూడలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో ఆ భవన యజమాని సత్యనారాయణ సింగ్ అలియాస్ సత్తూ సింగ్ కేరళకు పారిపోగా అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీసులు అతడిపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. ఒకప్పుడు.. 2004 ప్రాంతంలో ఇతగాడు ఓ చిన్న గుడుంబా వ్యాపారి. అయితే.. గచ్చి బౌలి ప్రాంతం క్రమంగా ఐటీ హబ్‌గా అభివృద్ది చెందడంతో సత్తూ సింగ్ ఫేట్ కూడా మారిపోయింది.

అక్కడి లోధాబస్తీలోని స్థానిక నేతలతో చేతులు కలిపి తన గుడుంబా వ్యాపారాన్ని విస్తరించాడు. గతంలో ఎన్నోసార్లు ఎక్సైజు పోలీసులు ఇతనిపై కేసులు పెట్టినా జరిమానాలు కట్టి బయటపడుతూ వచ్చాడు. తాజాగా ఈ ఏడంతస్తుల భవనాన్ని జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులూ పొందకుండానే నిర్మిస్తున్నాడని సత్తూ సింగ్‌పై ఆరోపణలున్నాయి. ఈ కాగా ఈ భవనం కూలిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 11కి పెరిగింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారాన్ని మంత్రి కెటీఆర్ ప్రకటించారు.

 
 
 
Related News

JournalistDiary