AP and TS / Entertainment
ద్యావుడా..! అపచారం !
12 days ago

‘ద్యావుడా’ అనే సినిమా వివాదాస్పదమైంది. ఈ మూవీ టీజర్ లో శివుడిని అపహాస్యం చేస్తూ సీన్స్ చిత్రీకరించారని బ్రాహ్మణ వర్గానికి చెందిన కొందరు తెలంగాణా డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలోని కొందరు పాత్రధారులచేత శివలింగానికి చికెన్ సమర్పించినట్టు, లింగంపై మద్యం పోస్తున్నట్టు, సీన్స్ చిత్రీకరించారని ఇది తమ మనోభావాలను దెబ్బ తీసిందని వారన్నారు. పైగా నలుగురు యువకులు శివలింగం మీద సిగరెట్లు విసిరే సీన్ కూడా చేర్చారని వారన్నారు. ఈ చిత్రాన్ని బ్యాన్ చేసి మేకర్స్ పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అయితే ఈ మూవీ డైరెక్టర్ సాయిరాం దాసరి మాత్రం ఇందులో తమ తప్పేమీ లేదని, కర్ణాటక లోని కాబ్రి మంజునాథ ఆలయంలో ఇలాంటి ఆచారాలు పాటిస్తున్నారని అన్నారు. వాటినే తాము తమ సినిమాలో వాడుకున్నట్టు తెలిపారు.(ఇటీవల యూ ట్యూబ్ లో ‘ద్యావుడా’ మూవీ టీజర్ విడుదలయింది). కాగా దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా డీజీపీ ఓ సీనియర్ పోలీసు అధికారిని ఆదేశించారు.

 
 
 
Related News

JournalistDiary