India / Crime
ఒకటికాదు.. రెండు చెప్పులు విసురు భాయ్
227 days ago

న్యూ ఇయర్ ఫస్ట్ డే జనవరి ఫస్ట్ నాడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు చేదు అనుభవం ఎదురైంది. నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ఆయన ఆదివారం హర్యానా లోని రోహతక్ లో జరిగిన ఓ సభలో మాట్లాడుతుండగా.. ఎవరో ఒక వ్యక్తి ఆయనపై షూ విసిరాడు. అది ఆయనకు తగలనప్పటికీ...ఆయన చలించలేదు. ఇలాంటి వాటికి తాను బెదిరేది లేదన్నారు.

ఆయనపై బూటు విసిరిన 26 ఏళ్ళ వికాస్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోట్ల రద్దు అతి పెద్ద కుంభ కోణమని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంతపెద్ద కుంభకోణాన్నితాను చూడలేదని కేజ్రీవాల్ అన్నారు.

అటు-సట్లెజ్-యమునా అనుసంధాన కాలువపై కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు తనకు కోపం కలిగించాయని, అందుకే నిరసనగా తాను ఆయనపై షూ విసిరానని వికాస్ పోలీసులవద్ద అంగీకరించాడు. కేజ్రీవాల్ మీద గతంలో కొందరు నిరసనకారులు ఇంకు (సిరా) చల్లిన విషయం విదితమే.

 
 
Related News