World / Health
ఉపాసం ఉండండి..ఆయుష్షు పెంచుకోండి
339 days ago

ఉపవాసం ఉంటే రోగాలు దరి చేరవట..ఆయుష్షు పెరుగుతుందట. రెగ్యులర్ గా ఉపవాసం చేస్తే హార్ట్ ఎటాక్, స్ట్రోక్, క్యాన్సర్ వంటివాటికి దూరంగా ఉండవచ్చునని యూఎస్ లోని పరిశోధకులు అంటున్నారు. కొద్దిసేపు ఆహారం తీసుకోకుండా ఉండడంవల్ల శరీరానికి రెస్ట్ దొరుకుతుందని, డీఎన్ఏ, ఇతర కణజాలం శక్తిమంతమవుతాయని వారు తేల్చారు. బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధ పడుతున్న మహిళలు సుమారు 13 గంటలపాటు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటే చాలా వరకు ఆ వ్యాధి రిస్క్ తగ్గిపోతుందని రీసెర్చర్లు  వెల్లడించారు. పైగా బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుందని కూడా పేర్కొన్నారు. అమెరికాలో 13 గంటలకన్నా తక్కువగా ఫుడ్ తీసుకోని మహిళల్లో క్యాన్సర్ రిస్క్ గమనించామని, ఇది 36 శాతం వరకు ఉందని స్పష్టం చేశారు. అంతే కాదు.. రాత్రి వేళల్లో ఆలస్యంగా ఆహారం తీసుకోవడం, కొద్దిసేపే ఉపవాసం ఉండడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ సరిగా ఉండదని గమనించారు. కొన్ని ఎలుకలపై కూడా పరిశోధనలు చేసి ఈ కొత్త విషయాలు తెలిపారు.

 

Read Also

 
Related News
JournalistDiary