AP and TS / Entertainment
శృతి ఎందుకలా..?
12 days ago

కమల్ హాసన్ కూతురిగా ఫిల్మ్స్‌లో ఎంట్రీ ఈజీగానే వచ్చినా.. శృతి హాసన్‌కి హిట్ మాత్రం ఈజీగా రాలేదు. మొదట్లో హీరోయిన్‌గా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ‘శృతి ఐరెన్ లెగ్’ అంటూ కామెంట్స్ వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ మూవీతో ఆమెకి ఫస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ వచ్చింది. తరువాత అటు తమిళం, ఇటు తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారిపోయిన శృతికి ఇప్పుడు చేతిలో ‘శభాష్ నాయుడు’ మూవీ ఒక్కటే వుంది.

ఇక తమిళ్ బాహుబలిగా తెరకెక్కించాలనుకున్న ‘సంఘమిత్ర’ కూడా శృతి చేజారిపోయింది. ఐతే.. రీసెంట్‌గా శృతి ఓ కన్నడ మూవీ చేయబోతోందనే న్యూస్ వచ్చింది. కానీ శృతి మాత్రం కన్నడ మూవీ చేయడం లేదంటూ క్లారిటీ ఇచ్చేసింది. అంతేకాదు.. ఇక ముందు కూడా కన్నడంలో సినిమాలు చేయనంటూ ఖచ్చితంగా చెప్పేసింది. దాంతో శృతి ఎందుకిలా చేస్తోందంటూ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.

 

Read Also

 
Related News
JournalistDiary