India / Crime
మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్.. తేలని నిజాలు
238 days ago

మల్కన్‌గిరి ఎన్‌‌కౌంటర్‌పై ఎన్నో తీరని అనుమానాలు. ఏవోబీలో నక్సలైట్ల తుడిచిపెట్టుకుపోయారని పోలీసులు చెబుతున్నారు. ఇటు గాయపడిన అగ్రనేతలు సేఫ్‌జోన్‌లోనే ఉన్నారంటున్నారు మావోయిస్టులు. వైవిధ్యమైన రెండు ప్రకటన లతో ఏదినిజమో తెలియని అయోమయ పరిస్థితి. ఈ కథనం వివరాల్లోకి వెళ్తే.. అక్టోబర్ 24న ఒడిషా‌లోని మల్కాన్‌గిరి జిల్లా లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 24 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇందులో ఏఓబీ మావోయిస్టు కార్యదర్శి ఆర్‌కే  అలియాస్ సాకేత్ కూడా మరణించాడని పోలీసులు చెబుతుండగా, ఆర్కే గాజర్ల రవి అలియాస్ ఉదయ్ రక్షణలో సేఫ్‌గానే ఉన్నాడంటూ జాతీయ మీడియా‌లో కథనాలు. ఈ ఎన్‌కౌంటర్ తరువాత  పోలీసులు కొన్ని డాక్యుమెంట్లు లభించాయని, కామ్రేడ్ ఎస్ స్థానంలో పద్మను నూతన కార్యదర్శి‌గా నియమించినట్టు వాటి ద్వారా బయటపడినట్టు కథనం. ఈ డాక్యుమెంట్ ను పోలీసులు స్క్రూటినైజ్ చేశారు.

మొత్తం 30 పేజీలున్న ఆ డాక్యుమెంట్‌కు (12th Annual Spe cial Zonal Committee Plenary ) 12వ ప్రత్యేక జోనల్ కమిటీ పేరిట టైటిల్ ఉంది. ఆగస్టులో ఎన్‌కౌంటర్‌కు రెండునెలల ముందు జోనల్ ప్లీనరీ  సమావేశం జరిగిందట. ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులకు 81,120 పేజీల డాక్యుమెంటరీ లభించింది. అందులో ఆర్కే పదవి మార్చిన విషయం నాలుగో పేజీలో ఉందని పోలీసువర్గాలందించిన సమాచారం. కామ్రేడ్ ఎస్ అంటే సాకేత్ అనే విషయం డాక్యుమెంటరీ ద్వారా అర్థమవుతోంది. ఛత్తీస్‌ఘడ్, ఒడిషా పోలీసులతో జరిపిన చర్చల్లో అక్కడ దళంలో పద్మ అనే వ్యక్తి లేదని, ఆర్కే తరువాత  ఏవోబి కొత్త కార్యదర్శిగా గాజర్ల రవి అలియాస్ ఉదయ్ నియమించారంటున్నారు పోలీసులు. కొత్తగా కార్యదర్శి పదవిలోవున్న 48 ఏళ్ల ఉదయ్ తెలంగాణా జయశంకర్ జిల్లా వెలిశాల గ్రామానికి చెందిన వాడని, 2000 ఏడాదిలో ఏవోబీకి ఆయన మారాడు. పీపుల్స్‌వార్ గ్రూప్ తరఫున కార్యదర్శిగా పని చేశాడు. ఏడాదిన్నర నుంచి రవి.. మల్కాన్‌గిరి,  కోరాపుట్ బోర్డర్ (MKB) ఏరియా డివిజన్ కార్యదర్శిగా పని చేశాడని, మావోయిస్ట్ ఐడియాలజీ అంటే అమితంగా ఇష్టపడే ఆయన అంటే కార్యకర్తలకు ఎనలేని గౌరవం.  కానీ తీవ్రమైన డయాబెటిస్ కారణంగా రవి పార్టీని వీడే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.

 

ఐటిఐ పాసైన రవికి ఇద్దరు అన్నదమ్ములూ మావోయిస్ట్ ఉద్యమంలోనే ఉన్నారని, రవి పెద్దన్న సారయ్య- భార్య రూపాలు వరంగల్ 2008లో జరిగిన ఎన్‌కౌంటర్లో మృతి చెందారు. మరో అన్నయ్య అశోక్ అలియాస్ అయితు గడ్చిరోలి, మహరాష్ట్ర డివిజన్‌లో మఖ్య కార్యదర్శిగా పనిచేసి గతేడాది తెలంగాణా పోలీసుల ఎదుట లొంగిపోయారు. మల్కాన్‌గిరి‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినవాళ్లలో తొలుత రవి కూడా ఉన్నారని భావించిన పోలీసులు, చివరకు అతడు బతికే ఉన్నట్టు తేల్చారు. ఇక ఆర్కే అలియాస్ రామకృష్ణ.. అలియాస్ సాకేత్.. గుంటూరు జిల్లా చెందిన ఆర్కే ఎనభయ్యో శకంలో   కొండపల్లి సీతారామయ్య శిష్యరికంలో పీపుల్స్‌వార్ గ్రూప్‌లో చేరారు. ఏపీ స్టేట్ కమిటీకి కార్యదర్శిగా, పల్నాడు, నల్లమల జోన్ ఏరియాల్లో పని చేశాడు. ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల తర్వాత ఏవోబికి వచ్చారు ఆర్కే. ఆయన్ని మట్టుబెట్టేందుకు  ఏపీ, ఒడిషా పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకున్నాడు. ఆరేళ్ల కిందట కోరాపుట్‌లో పోలీసులకు ఆయన భార్య శిరీష చిక్కారు. ఇక ప్లాటూన్ కమాండర్‌గా పని చేస్తున్న కొడుకు పృధ్వీ కూడా మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్లో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ ఆర్కే రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుందని చెబుతున్నారు.

 

 

 

 
 
Related News